మనసు పిలుపు

మనసులోంచి వచ్చిన మాటలు

సాహిత్యంపై ఉన్న మక్కువతో, నా మనసులోని భావాలకు అక్షర రూపం ఇచ్చే చిన్న ప్రయత్నమే ఈ వేదిక. ఇక్కడ మీరు చదివే ప్రతి కథ, కవిత, వ్యాసం నా అంతరంగంలోంచి పుట్టినవే. ఆధునిక ప్రపంచపు హడావిడికి దూరంగా, కాసేపు ప్రశాంతంగా కూర్చుని చదువుకోవడానికి ఈ వెబ్‌సైట్‌ను సృష్టించాను. మీ పఠనానుభూతి ప్రశాంతంగా, ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

తాజా వ్యాసాలు (Latest Articles)

ధర్మం లేని చోట స్వర్గం ఉంటుందా?

“Pav ke niche Jannath hai” అంటారు… అవును, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని చెబుతారు. కానీ… ఆ స్వర్గాన్ని చేరుకోవడానికి ధర్మాన్ని వదిలేయాలా? ప్రేమ కోసం సత్యాన్ని త్యజించాలా? బంధం కోసం న్యాయాన్ని మరిచిపోవాలా? తల్లి పట్ల గౌరవం అంటే, ఆమె చెప్పిందే ధర్మమని నమ్మడమా? లేక ధర్మం ముందు అందరూ సమానమని అంగీకరించడమా? అధర్మాన్ని సమర్థిస్తూ స్వర్గం దొరికితే, అది నిజంగా స్వర్గమేనా? సత్యం కోసం నిలబడితే నరకం ఎదురైనా, అది ఓటమా? […]

6/21/2026Read more →

కర్మ దశాపథం

“అమ్మా… ప్రతి బాధ వెనుక ఒక కథ ఉంటుంది.” కంసుడి చెరసాలలో ఎన్నో సంవత్సరాలు బంధన జీవితం గడిపిన దేవకి, విముక్తి పొందిన తర్వాత కృష్ణుడిని అడిగిందట: “నాయనా… నిన్ను అందరూ భగవంతుడు అంటున్నారు. నన్ను ఈ చెరసాల నుంచి విడిపించడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది?” అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడట: “అమ్మా… కాలం, కర్మ, ఫలితం అన్నీ ఒకే దారంతో ముడిపడి ఉంటాయి. పూర్వజన్మలో నీవే కైకేయిగా జన్మించి, నన్ను రాముడిగా వనవాసానికి […]

6/20/2026Read more →

స్త్రీ అందం కళ్లను ఆకర్షిస్తుంది… ఆమె మనసు జీవితాన్ని మార్చేస్తుంది.

ఒక మగాడు ఓ స్త్రీ అందానికి,ఆమె మాటల మాధుర్యానికి,ఆమె చూపుల మత్తుకు మోహించాడో… తన జీవితాన్నే ఆమె పాదాల వద్ద ఉంచేస్తాడు. ఆమె మెప్పుకోసం,ఆమె ఆనందం కోసం,ఆమె ప్రేమ కోసం… ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడు. కొన్నిసార్లు ఆ మోహంలో,ఆ విరహంలో,తనను తాను కోల్పోతాడు. ఒక స్త్రీలో ఉన్న ఆకర్షణ ఎంత గొప్పదంటే… తన అందంతో,తన అభినయంతో,తన సాన్నిధ్యంతో… ఎంతటి మగాడినైనా తన చుట్టూ తిప్పుకోగలదు. కానీ స్త్రీ అనేది కేవలం అందం కాదు. ఆమెలో ఆకర్షణ ఉంది,అపారమైన […]

6/20/2026Read more →

కామమే జీవిత పరమార్థం అయితే…

కామమే జీవిత పరమార్థం అయితే,ఈ దేహాన్ని ఎప్పుడో ఖర్చు చేసేసి ఉండేవాడినేమో… ఒక క్షణిక సుఖమే అంతిమ సత్యమైతే,ఇన్ని ప్రశ్నలతో ఈ మనసు ఎందుకు మండేది? నన్ను నడిపించింది వాంఛ కాదు, వెతుకులాట.నన్ను వెంటాడింది శరీరం కాదు, సత్యం. కామం ఒక దాహం మాత్రమే, కానీ నా దాహం దానికంటే లోతైనది. ఈ విశ్వం ఎందుకు?ఈ జీవితం దేనికి?ఈ ప్రేమ, ఈ బాధ, ఈ విరహం, ఈ ఆనందం—వీటి వెనుక అర్థం ఏమిటి?అనే ప్రశ్నలే నా అంతరంగంలో […]

6/19/2026Read more →

నా విలువలపై నిర్మించిన రాజ్యంలో అడుగుపెట్టవచ్చు… కానీ వాటిని కూల్చే హక్కు ఎవరికీ లేదు.

నా ప్రపంచం – నా విలువల రాజ్యం ప్రతి మనిషి బయట కనిపించే ప్రపంచంలో జీవిస్తాడు. కానీ నిజానికి అతని అసలు జీవితం అతను తనలో నిర్మించుకున్న ప్రపంచంలోనే సాగుతుంది. నేనూ అలాంటి ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. అది ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు, అధికారంతో నడిచే రాజ్యం కాదు. అది నా ఆలోచనలు, అనుభవాలు, నమ్మకాలు, నైతిక విలువలు, ఆత్మగౌరవం, బాధ్యతలతో నిర్మితమైన ఒక అంతర్గత ప్రపంచం. ఆ ప్రపంచంలో ప్రతి నిర్ణయానికి ఒక విలువ […]

6/19/2026Read more →

ప్రశ్నలే నా సహచరులు

మొదటినుంచి… అంటే బాల్యం నుంచే… నా మది ప్రశ్నలే.అమ్మ ఒడిలో కథలు వింటున్న వయసులోనే, ఆ కథల వెనుక నిజం ఏమిటో తెలుసుకోవాలనిపించేది. ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలు ఎందుకు మెరవాలి? వాన ఎందుకు కురవాలి? మనిషి ఎందుకు పుడతాడు? మళ్లీ ఎందుకు వెళ్లిపోతాడు? అని అడిగిన ప్రశ్నలకు ఎవరూ పూర్తి సమాధానం చెప్పలేకపోయారు. వయసు పెరిగింది… పాఠ్యపుస్తకాలు పెరిగాయి… జ్ఞానం పెరిగిందనుకున్నాను… కానీ ప్రశ్నలు కూడా అంతకంటే వేగంగా పెరిగిపోయాయి. జీవితంలో కొందరు ఎదురయ్యారు. వారిని […]

6/19/2026Read more →

అన్నీ అర్థమయ్యాక కాదు… ఏదీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదనిపించినప్పుడు

ప్రపంచం అంటుంది… “కోటిమందిలో ఒక్కడైనాఆడదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు” అని. సరే…ఆ ఒక్కడైనా అర్థం చేసుకుంటాడా అని చూస్తే, అతడు మాత్రంఆమెను అర్థం చేసుకునే పనిలో కాక,తనని తాను కనుగొనే ప్రయాణంలో ఉంటాడు. కాలం గడుస్తుంది…అనుభవాలు పెరుగుతాయి…ఆశలు తగ్గుతాయి…చివరికి అతడు ఏదీ అవసరం లేని స్థితికి చేరుకుంటాడు. అప్పుడువాదనలు ఉండవు,నిరూపణలు ఉండవు,ఎవరినీ అర్థం చేసుకోవాలనే తపన ఉండదు. అందుకే కాబోలు… అందరూ అంటారు,”ఏంటి వీడు…ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు!” అని. వాళ్లకు తెలియదు…అది నవ్వు కాదు,అర్థం చేసుకోవాలనే ప్రయత్నాలన్నీ […]

6/18/2026Read more →

నేను నన్ను కనుగొన్న రోజు

ఒకప్పుడు నేనుచిరునామా లేని ఉత్తరంలా ఉండేవాడిని. కాలం అనే తపాలావాడికీనన్నెక్కడ చేర్చాలో తెలియక,తన సంచిలోనే మోస్తూ తిరిగినమడతపడిన కాగితాన్ని. నా లోపల ఒక ఖాళీ గది ఉండేది. అందులో నా అడుగుల ప్రతిధ్వనులేనాకు అపరిచితుడి స్వరంలా వినిపించేవి. అద్దం ముందు నిలబడితేఒక మనిషి కనిపించేవాడు. కానీ అతని కళ్లలోనేను కనిపించేవాడిని కాదు. ఒక రోజునా ఓటములన్నీ నా తలుపు తట్టాయి. ఈసారి నేను భయపడలేదు. తలుపు తెరిచివాటిని లోపలికి ఆహ్వానించాను. వాటి పక్కనే కూర్చునినా జీవిత కథను […]

6/18/2026Read more →

తిరుగుబాటు మా వేదాంతం

ఉద్యోగం రాలేదని,వ్యాపారం దెబ్బతినిందని,స్నేహితుడొకడు మోసం చేశాడని,ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని…అలాగే ఉండి పోతే ఎలా…? నువ్వు పడుకునే పరుపునిన్ను చీదరించుకోకముందేబద్దకాన్ని వదిలేయ్… అలజడి మా జీవితంఆందోళన మా ఊపిరితిరుగుబాటు మా వేదాంతం ముళ్లూ, రాళ్ళూ,అవాంతరాలెన్ని ఉన్నాముందు దారి మాది..కుదిరితే పరుగెత్తు..లేకపోతే నడువు.. అదిచేతకాకపోతే..పాకుతూపో అంతేకాని ..ఒకే చోట అలా కదలకుండాఉండిపోకు … గెలవకపోవడం ఓటమి కాదు,మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి!” -శ్రీ శ్రీ ✍️మహాకవిమహా ప్రస్థానం

6/18/2026Read more →