“Pav ke niche Jannath hai” అంటారు…
అవును, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని చెబుతారు.
కానీ…
ఆ స్వర్గాన్ని చేరుకోవడానికి ధర్మాన్ని వదిలేయాలా?
ప్రేమ కోసం సత్యాన్ని త్యజించాలా?
బంధం కోసం న్యాయాన్ని మరిచిపోవాలా?
తల్లి పట్ల గౌరవం అంటే, ఆమె చెప్పిందే ధర్మమని నమ్మడమా? లేక ధర్మం ముందు అందరూ సమానమని అంగీకరించడమా?
అధర్మాన్ని సమర్థిస్తూ స్వర్గం దొరికితే, అది నిజంగా స్వర్గమేనా?
సత్యం కోసం నిలబడితే నరకం ఎదురైనా, అది ఓటమా? లేక మనసాక్షి ముందు గెలుపా?
“Pav ke niche Jannath hai” అనే మాటను నేను గౌరవిస్తాను…
కానీ నా మనసు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే…
ధర్మం లేని చోట స్వర్గం ఉంటుందా?
లేక…
ధర్మం ఉన్న చోటే నిజమైన స్వర్గం ఉంటుందా?
ఈ ప్రశ్నలకు సమాధానం నాకు ఇంకా దొరకలేదు…
అందుకే నేను నిశ్శబ్దంలో ఉన్నాను… సందిగ్ధంలో ఉన్నాను… ఆలోచనలో ఉన్నాను…