← Back to all posts

అన్నీ అర్థమయ్యాక కాదు… ఏదీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదనిపించినప్పుడు

ప్రపంచం అంటుంది…

“కోటిమందిలో ఒక్కడైనాఆడదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు” అని.

సరే…ఆ ఒక్కడైనా అర్థం చేసుకుంటాడా అని చూస్తే,

అతడు మాత్రంఆమెను అర్థం చేసుకునే పనిలో కాక,తనని తాను కనుగొనే ప్రయాణంలో ఉంటాడు.

కాలం గడుస్తుంది…అనుభవాలు పెరుగుతాయి…ఆశలు తగ్గుతాయి…చివరికి అతడు

ఏదీ అవసరం లేని స్థితికి చేరుకుంటాడు.

అప్పుడువాదనలు ఉండవు,నిరూపణలు ఉండవు,ఎవరినీ అర్థం చేసుకోవాలనే తపన ఉండదు.

అందుకే కాబోలు…

అందరూ అంటారు,”ఏంటి వీడు…ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు!” అని.

వాళ్లకు తెలియదు…అది నవ్వు కాదు,అర్థం చేసుకోవాలనే ప్రయత్నాలన్నీ ముగిసిన తర్వాతమిగిలిపోయిన ప్రశాంతత అని.

ఈ బ్లాగ్‌లోని రచనలు మీకు నచ్చినట్లయితే, ఈ స్వచ్ఛమైన ప్రయాణం ఇలాగే ముందుకు సాగడానికి మీ వంతు మద్దతు అందించండి.