← Back to all posts

తిరుగుబాటు మా వేదాంతం

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని…
అలాగే ఉండి పోతే ఎలా…?

నువ్వు పడుకునే పరుపు
నిన్ను చీదరించుకోకముందే
బద్దకాన్ని వదిలేయ్…

అలజడి మా జీవితం
ఆందోళన మా ఊపిరి
తిరుగుబాటు మా వేదాంతం

ముళ్లూ, రాళ్ళూ,
అవాంతరాలెన్ని ఉన్నా
ముందు దారి మాది..
కుదిరితే పరుగెత్తు..
లేకపోతే నడువు..

అదిచేతకాకపోతే..
పాకుతూపో అంతేకాని ..
ఒకే చోట అలా కదలకుండా
ఉండిపోకు …

గెలవకపోవడం ఓటమి కాదు,
మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి!”


-శ్రీ శ్రీ ✍️
మహాకవి
మహా ప్రస్థానం

ఈ బ్లాగ్‌లోని రచనలు మీకు నచ్చినట్లయితే, ఈ స్వచ్ఛమైన ప్రయాణం ఇలాగే ముందుకు సాగడానికి మీ వంతు మద్దతు అందించండి.