జనాలకి సరదాగా, సంతోషంగా ఉండటానికి ఏమి నొప్పో నాకు ఇప్పటికీ అర్థం కాదు…
లైఫ్‌లో కష్టాలు ఉంటాయి…
బాధలు ఉంటాయి…
నిరాశలు ఉంటాయి…
నాకూ తెలుసు…
నాకు ఒక జీవితం ఏడ్చింది.
కానీ ఫేస్‌బుక్‌లో కూడా అదే ఏడుపు ఎందుకు?
నీ కన్నీళ్లు…
నీ కష్టాలు…
నీ కోపాలు…
నీ విరహాలు…
నిజం చెప్పాలంటే వాటిని ప్రతిరోజూ భరించే తీరిక ఎవరికీ లేదు.
ఎందుకంటే వాడి జీవితంలో వాడికే చాలానే సమస్యలు ఉన్నాయి.
నవ్వండి…
నవ్వించండి…
లేకపోతే ఫోన్ పక్కన పెట్టి గుక్కపెట్టి ఏడవండి…
అది మీ ఇష్టం.
కానీ ప్రతిరోజూ ఏడుపుగొట్టు పోస్టులు పెట్టి పది మంది మూడ్ పాడుచేయకండి.
రక్తం ఉరకలెత్తించే రచనలు లేవు…
యువతను ఉప్పొంగించే కవితలు లేవు…
కలలు కనమని చెప్పే మాటలు లేవు…
ఎటు చూసినా బాధ…
ఎటు చూసినా విరహం…
ఎటు చూసినా కన్నీళ్లు…
లైఫ్‌లో అవే…
ఫేస్‌బుక్‌లో కూడా అవే…
కొంచెం బ్రతికున్నట్టు రాయండి రా…
చదివిన వాడికి జీవితం మీద మళ్లీ ప్రేమ పుట్టేలా రాయండి.
పడిపోయిన వాడిని లేపేలా రాయండి.
నిరాశలో ఉన్న వాడికి ఆశ కలిగేలా రాయండి.
బాధను రాయడం తప్పు కాదు…
కానీ బాధనే జీవితం అన్నట్టు రాయడం మాత్రం తప్పు.
ప్రతిరోజూ చీకటిని చూపించే రచయిత కంటే,
ఒక్క దీపం వెలిగించే రచయిత సమాజానికి ఎక్కువ అవసరం.
కొంతమంది ఏడుపుగొట్టు రచయితలకు అంకితం.