← Back to all posts

నేను చాలా గ్రూపుల నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే…

గ్రూప్ అంటే నాకు స్నేహం, సరదా, ఆహ్లాదకరమైన సంభాషణలు, అప్పుడప్పుడూ నవ్వులు పంచుకునే వేదిక. కానీ కాలక్రమేణా చాలా గ్రూపుల్లో ఆ వాతావరణం కనిపించలేదు.

గ్రూప్ ఉద్దేశానికి సంబంధం లేని పోస్టులు, నిరంతర రాజకీయ ప్రచారాలు, వాదనలు, ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. కానీ వాటిని గౌరవించకుండా బలవంతంగా అంగీకరింపజేయాలనుకోవడం స్నేహాలకు దూరం చేస్తుంది.

నాకు ఎవరి రాజకీయాలు, మతం, వ్యక్తిగత అభిప్రాయాలతో సమస్య లేదు. కానీ ప్రతి విషయాన్ని వాటి చుట్టూనే తిప్పడం, గ్రూప్ అసలు ఉద్దేశాన్ని మర్చిపోవడం నచ్చలేదు. నవ్వులు పంచుకోవాల్సిన చోట వాదనలు, స్నేహం పెరగాల్సిన చోట విభేదాలు పెరగడం బాధ కలిగించింది.

అందుకే కొంతమంది వ్యక్తులను కాదు, ఆ వాతావరణాన్ని వదిలి బయటకు వచ్చాను. మనసుకు ప్రశాంతత, స్నేహానికి విలువ, సంభాషణలో గౌరవం ఉన్న చోటే ఉండాలని నిర్ణయించుకున్నాను.

స్నేహం నిలవాలి… అభిప్రాయాలు మారవచ్చు. కానీ స్నేహితులను కోల్పోయేంతగా ఏ సిద్ధాంతమూ గొప్పది కాదు.


English Version

People often ask why I left so many groups.

For me, a group is meant to be a place for friendship, meaningful conversations, laughter, and a sense of community. Unfortunately, over time, many groups seemed to lose that spirit.

Instead of light-hearted interactions and enjoyable discussions, they became filled with posts unrelated to the group’s purpose, constant political debates, and attempts to push personal opinions onto others. Having different views is natural and healthy, but forcing those views on others often creates division rather than understanding.

I have no problem with anyone’s political beliefs, ideology, or personal opinions. What I find difficult is when every conversation revolves around them, overshadowing the very reason the group was created. Places that should bring people together can quickly become spaces that drive people apart.

So, I didn’t leave because of any particular person. I left because of the atmosphere. I value peace of mind, mutual respect, and genuine friendship more than endless arguments and unnecessary negativity.

Friendship should outlast opinions. We may disagree on many things, but no ideology is worth losing good people over.


ఈ బ్లాగ్‌లోని రచనలు మీకు నచ్చినట్లయితే, ఈ స్వచ్ఛమైన ప్రయాణం ఇలాగే ముందుకు సాగడానికి మీ వంతు మద్దతు అందించండి.