విధి రాతలో ప్రతి ప్రేమకు కలయిక రాసి ఉండకపోవచ్చు…
కానీ నిజమైన ప్రేమకు శాశ్వతమైన అర్థం మాత్రం తప్పక ఉంటుంది.
ప్రేమ అంటే సొంతం చేసుకోవడం కాదు…
మనసారా ప్రేమించగలగడం.
కొన్ని బంధాలు కాలంతో కలిసి నడుస్తాయి…
కొన్ని జ్ఞాపకాలై జీవితమంతా వెంట ఉంటాయి.
విధి కొన్నిసార్లు ఇద్దరినీ ఒకే దారిలో నడపదు…
అయినా హృదయం వారిని గౌరవించడం మానదు.
నిజమైన ప్రేమకు ముగింపు అనేది ఉండదు…
అది రూపం మాత్రమే మార్చుకుంటుంది.
కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్లకపోవచ్చు…
కానీ గుండె చప్పుడు ఉన్నంత వరకు
ఒక నిశ్శబ్ద జ్ఞాపకంలా జీవిస్తూనే ఉంటాయి. ❤️🥀
“ఈ రచన కొత్తగా హార్ట్ బ్రేక్ అయిన వారి కోసం…
ఇప్పటికే ఆ బాధను పీహెచ్‌డీ స్థాయిలో పూర్తి చేసిన వారి ఆశీర్వాదాలతో! 🤣🥀”